విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్దన’ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం చిత్రబృందం క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్లైమాక్స్‌ను భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్లు కూడా నిర్మిస్తున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నారని టాక్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర, లుక్ ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని విధంగా ఉండనున్నట్లు సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. భారీ యాక్షన్, ఎమోషన్స్, గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ‘రౌడీ జనార్దన’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది.

