‘లెనిన్’ కోసం థియేటర్‌కు వచ్చిన జైనబ్

‘లెనిన్’ కోసం థియేటర్‌కు వచ్చిన జైనబ్

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా రెస్పాన్స్‌ను స్వయంగా తెలుసుకునేందుకు అఖిల్ భార్య జైనబ్ రవ్‌జీ హైదరాబాద్‌లోని ప్రముఖ శ్రీరాములు థియేటర్‌కు వెళ్లారు.

థియేటర్‌కు చేరుకున్న జైనబ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించిన ఆమె, సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్, అఖిల్ నటనకు లభిస్తున్న ప్రశంసలపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం థియేటర్‌లో జైనబ్ సందడి చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరి రావు, ప్రమోద్ పంజు కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Related Articles