మూడేళ్ల విరామం తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుండగా, టాలీవుడ్ హీరోలు చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు.
నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ‘‘లెనిన్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నేను దగ్గర నుంచి చూశాను. ఈ సినిమా నీకు గొప్ప విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్’’ అంటూ అఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
హీరో ఆది సాయికుమార్ కూడా ట్రైలర్‌ను ప్రశంసిస్తూ, తమన్ అందించిన మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. హీరో కిరణ్ అబ్బవరం సైతం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహాభారతం స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ, మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు వారి ప్రేమ, సహనానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి తన మాటలు కాదు, సినిమా మాట్లాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

