టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో రిపీట్ కానుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో కొత్త సినిమా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ త్రిశూలంతో కూడిన ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్.. త్రివిక్రమ్‌తో మరోసారి” అనే క్యాప్షన్‌తో చేసిన ఈ ప్రకటన అభిమానుల్లో ఆసక్తి పెంచింది.
పోస్టర్‌ను బట్టి ఈ చిత్రం పురాణాల నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించనున్నారు.
ఇదివరకు ఎన్టీఆర్– త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ (2018) ఘన విజయం సాధించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. బాక్సాఫీస్ వద్ద రూ.165 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి పనిచేయనుండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

