స్టార్ అయ్యాక బయటపెట్టిన షాకింగ్ నిజం..?

స్టార్ అయ్యాక బయటపెట్టిన షాకింగ్ నిజం..?

ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రసీమల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ కయాదు లోహర్ తన సినీ ప్రయాణానికి ముందు ఎదుర్కొన్న కష్టాలను తాజాగా వెల్లడించింది. సాయి అభయంక్‌తో కలిసి ఆమె నటించిన ‘పవళ్ మళ్లీ’ పాట ట్రెండింగ్‌లో ఉండగా, ఓ ఇంటర్వ్యూలో తన గత జీవితాన్ని గుర్తుచేసుకుంది. సినిమాల్లోకి రాకముందు స్టార్‌బక్స్, బట్టల దుకాణంతో పాటు పలు ఐటీ కంపెనీల్లో కూడా పనిచేశానని తెలిపింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తనకు ల్యాప్‌టాప్‌ను సరిగ్గా ఉపయోగించడం కూడా రాదని, ఐటీ కంపెనీల్లో శిక్షణ దశలో మాత్రమే పనిచేశానని చెప్పింది. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాతే నటిగా అవకాశాలు దక్కాయని వెల్లడించింది. మలయాళంలో టోవినో థామస్‌తో ‘పల్లిచట్టంబి’ చిత్రంలో నటించిన కయాదు, తెలుగులో ఇటీవల విశ్వక్ సేన్ సరసన ‘ఫంకీ’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న చిత్రంతో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె, సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది.

Related Articles