జూన్ 30న ‘లెనిన్’ ట్రైలర్ విడుదల..

జూన్ 30న ‘లెనిన్’ ట్రైలర్ విడుదల..

అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ సినిమా ప్రమోషన్లలో వేగం పెంచింది. ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 30న విశాఖపట్నంలో ఘనంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సాయంత్రం 4 గంటలకు నగరంలోని శరత్ థియేటర్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనుండగా, అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. గ్రామీణ నేపథ్యంలోని రస్టిక్ లుక్‌లో సైకిల్ తొక్కుతూ కనిపించిన అఖిల్, తన కెరీర్‌లో ఇప్పటివరకు కనిపించని మాస్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నారు. ‘ఏజెంట్’ తర్వాత వస్తున్న ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు కీలకమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ‘లెనిన్’ సినిమా జులై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Related Articles