ఆగస్టులో సెట్స్‌పైకి ‘జార్జ్ క్రిష్’

ఆగస్టులో సెట్స్‌పైకి ‘జార్జ్ క్రిష్’

దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘జార్జ్ క్రిష్’ చిత్రం ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆగస్టు తొలి వారంలో మొదటి షెడ్యూల్‌లో కీలక ప్రారంభ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని, అనంతరం నాలుగో వారంలో జరిగే రెండో షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్‌లపై ప్రేమ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ సినిమాలతో గుర్తింపు పొందిన అనంతిక సనీల్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవల గోపీచంద్‌తో శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘విశ్వం’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఈసారి బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలియని వయసులో హీరో చేసిన ఓ తప్పు కారణంగా అతని జీవితంలో జరిగే పరిణామాల చుట్టూ కథ సాగుతుందని సమాచారం. ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మించనుండగా, త్వరలోనే హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Related Articles