బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తన సినీ ప్రయాణం, విజయానికి కారణమైన అంశాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కంగనా మాట్లాడుతూ, తనపై ఎన్నో సంవత్సరాలుగా విమర్శలు వస్తూనే ఉన్నాయని, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ అవి ఆగలేదని అన్నారు. అయితే, తన దశాబ్దాల సినీ కెరీర్ను వెనక్కి తిరిగి చూసుకుంటే, మనసును తాకే కథలే తన ఎదుగుదలకు ప్రధాన కారణమని చెప్పారు. నటీనటుల కంటే వారు పోషించే పాత్రలే గొప్పవని తాను ఎప్పుడూ నమ్ముతానని వెల్లడించారు.
మంచి పాత్రలు దక్కాలంటే ఓర్పు, సహనం అవసరమని, స్టార్ హీరోలతో వచ్చే ప్రతి కమర్షియల్ సినిమాకు అంగీకరించాల్సిన అవసరం లేదని కంగనా పేర్కొన్నారు. నచ్చని కథలకు ‘నో’ చెప్పడం కూడా కెరీర్లో ముఖ్యమని అన్నారు. అలాంటి నిర్ణయాల వల్ల కొన్నిసార్లు అవకాశాలు కోల్పోవాల్సి వచ్చినా, మంచి కథల కోసం వేచి ఉండాలని సూచించారు.
తాను కూడా అదే విధానాన్ని అనుసరించి తన కెరీర్ను నిర్మించుకున్నానని కంగనా తెలిపారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచాయి.

