రాజ్ దాసిరెడ్డి లేటెస్ట్ విజిట్ వెనుక స్పెషల్ రీజన్ ఇదేనా?

రాజ్ దాసిరెడ్డి లేటెస్ట్ విజిట్ వెనుక స్పెషల్ రీజన్ ఇదేనా?

‘భద్రం బీ కేర్‌ఫుల్’ ఫేమ్ నటుడు రాజ్ దాసిరెడ్డి ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ వ్యూట్టన్ హైదరాబాద్ స్టోర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టోర్‌లోని ప్రీమియం కలెక్షన్స్‌ను వీక్షించిన ఆయన, అక్కడ గడపడం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపారు. హ్యాండ్‌బ్యాగ్స్, షూస్, జ్యువెలరీతో పాటు విలాసవంతమైన ఫ్యాషన్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన లూయిస్ వ్యూట్టన్‌కు 172 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఈ బ్రాండ్ ఉత్పత్తులను వినియోగించడం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలకు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో రాజ్ దాసిరెడ్డి స్టోర్ సందర్శన సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, రాజ్ దాసిరెడ్డి తన తదుపరి చిత్రాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొత్త సినిమా వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Related Articles