మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఇరుముడి’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ వీడియో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేయగా, తాజాగా చిత్రబృందం మ్యూజిక్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 29న ‘ఇరుముడి కట్టు’ తొలి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయ్యప్ప మాల ధరించిన రవితేజ భక్తుల మధ్య ఆలయం వైపు చేయి ఎత్తి చూపుతున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. యాత్రా సీజన్‌కు అనుగుణంగా విడుదలవుతున్న ఈ పాట ఆధ్యాత్మిక అనుభూతిని పంచడంతో పాటు సినిమాకు మరింత హైప్ తీసుకురానుంది. ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వసిక ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
- June 27, 2026
0
8
Less than a minute
You can share this post!
editor

