ఆ సంఘటన ఇప్పటికీ బాధిస్తుంది: అలియా

ఆ సంఘటన ఇప్పటికీ బాధిస్తుంది: అలియా

నటి అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ఆల్ఫా’ జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచారంలో భాగంగా ఆమె షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను పంచుకున్నారు. యాక్షన్ సన్నివేశాల రిహార్సల్స్‌లో భాగంగా ఓ కొరియోగ్రాఫర్‌కు అనుకోకుండా దెబ్బ తగిలిందని అలియా తెలిపారు. వెంటనే క్షమాపణ చెప్పానని, తన వల్ల ఒకరికి గాయం కావడం ఇప్పటికీ బాధ కలిగిస్తోందని చెప్పారు. అయితే ఈ సంఘటనతో సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఎంత సహజంగా తెరకెక్కాయో అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘ఆల్ఫా’ తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని, ఇందులో కొత్త తరహా పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో బాబీ దేవోల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలియాతో యాక్షన్ సన్నివేశాల్లో నటించే సమయంలో ఆమెకు ఎక్కడైనా గాయం అవుతుందేమోనని భయపడ్డానని ఆయన చెప్పారు. అలియా యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చేశారని ప్రశంసించారు. శివ్ రావేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

Related Articles