మిస్ అయిన సినిమాలపై రేఖ స్పందన

మిస్ అయిన సినిమాలపై రేఖ స్పందన

‘ఆనందం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రేఖ వేదవ్యాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఆనందం’ సినిమానే తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ‘ఆనందం’ చిత్రంలో తొలుత హీరోగా ఉదయ్ కిరణ్ నటించాల్సి ఉందని రేఖ వెల్లడించారు. అలాగే ఆయనతో కలిసి చేయాల్సిన రెండు, మూడు సినిమాలు మిస్ అయ్యాయని, ‘కలుసుకోవాలని’ చిత్రంలో కూడా తానే హీరోయిన్‌గా నటించాల్సి ఉండేదని చెప్పారు.

కొన్ని అనుకోని కారణాలతో ఇండస్ట్రీకి దూరమయ్యానని, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావాలని ఉందని రేఖ తెలిపారు. అందుకు సినీ పరిశ్రమ నుంచి సహకారం అందాలని కోరారు. పెళ్లి గురించి అడగగా, “సల్మాన్ ఖాన్ తర్వాత నేనే సింగిల్‌గా మిగిలిపోతానేమో” అంటూ సరదాగా స్పందించారు. అనారోగ్య సమయంలో జీవితంపై ఆశలు వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని రేఖ భావోద్వేగంగా చెప్పారు. ప్రస్తుతం మంచి అవకాశాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

Related Articles