ఓటీటీలోకి ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’

ఓటీటీలోకి ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్ భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

నాలుగు ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి తదితరులు ‘బాహుబలి’ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘బాహుబలి లెగసీ ఇంకా ముగియలేదు.. పార్ట్-3 కూడా ఉంటుంది’ అని ఆయన పేర్కొనడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ప్రభాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ‘బాహుబలి-3’ నిజంగానే వస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles