‘ఓజీ 2’కు గ్రీన్ సిగ్నల్

‘ఓజీ 2’కు గ్రీన్ సిగ్నల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజీ’ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ‘ఓజీ 2’ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

“గంభీర కథ సిద్ధమవుతోంది.. తుపాను రాకముందు నిశ్శబ్దం ఉంటుంది” అనే క్యాప్షన్‌తో మేకర్స్ ఆసక్తిని పెంచారు. వీడియోలో పవన్ కళ్యాణ్, సుజీత్ కలిసి స్క్రిప్ట్‌పై చర్చిస్తున్న దృశ్యాలు కనిపించాయి. చివర్లో పవన్ కళ్యాణ్ “నేను రెడీ” అని చెప్పడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

దీంతో ‘ఓజీ 2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సంకేతాలు అందుతున్నాయి. మొదటి భాగానికి సంగీతం అందించిన థమన్ ఎస్ ఈ సీక్వెల్‌కూ సంగీత దర్శకుడిగా కొనసాగనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘ఓజీ’లో చూపించిన గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని ఈసారి మరింత విస్తృతంగా, కొత్త కోణంలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’కు సమయం కేటాయించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles