యువ నటుడు హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన ప్రేమకథా చిత్రం ‘దీవాన’ ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. హీరోయిన్ స్మేహ మణిమేగలై ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. దర్శకుడు శ్రీకాంత్, హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘దీవాన’ ఒక టైమ్‌లెస్ లవ్ స్టోరీ అని పేర్కొన్నారు. ప్రేమ అనే భావనను నిజ జీవితానికి దగ్గరగా చూపించామని చెప్పారు. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, అనేక అభినందన సందేశాలు అందుతున్నాయని వెల్లడించారు. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు జీవితాంతం గుర్తుంచుకునే అనుభూతిని పొందుతారని అన్నారు. కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు పాల్గొని చిత్ర విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు.
- June 23, 2026
0
5
Less than a minute
You can share this post!
editor

