బాలయ్య కొత్త సినిమా పూజా కార్యక్రమం ఎక్కడంటే..?

బాలయ్య కొత్త సినిమా పూజా కార్యక్రమం ఎక్కడంటే..?

నందమూరి బాలకృష్ణ, స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘NBK112’ జూన్ 25న ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు కొరటాల శివ పవర్‌ఫుల్ కథనం జతకావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారవడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ‘NBK112’కు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles