స్టైలిష్ లుక్‌తో షాక్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్!

స్టైలిష్ లుక్‌తో షాక్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. తాజాగా విడుదలైన కొత్త పోస్టర్‌లో దుల్కర్ అత్యంత స్టైలిష్, మాస్ అవతార్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ కలిసి వేఫరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని వందకు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. ఆగస్టు 20, 2026న ఓనం కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దుల్కర్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆంటోని వర్గీస్, మిస్కిన్, కాయడు లోహర్, కతిర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, అన్‌బరివ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ‘ఐ యామ్ గేమ్’ ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Related Articles