ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేసింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ ఏడు ఎపిసోడ్ల సిరీస్‌ను ప్రశాంత్ రఘతి రచించగా, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు అందించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సిరీస్‌లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో నేరాలు, రాజకీయాలు, అధికారం కోసం జరిగే పోరాటాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆశ, దురాశ, ప్రతీకారం, వ్యక్తిగత విధేయతల మధ్య జరిగే సంఘర్షణలను ఉత్కంఠభరితంగా చూపించనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్, ఊహించని మలుపులతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అధికార పోరాటాలు, కుటుంబ ద్రోహాలు, రాజకీయ ఎత్తుగడలతో నిండిన ‘ఇసకపట్నం’ సిరీస్ జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు పలు భాషల సబ్‌టైటిల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
- June 16, 2026
0
9
Less than a minute
You can share this post!
editor

