బిగ్‌బాస్ హౌస్‌లోకి పల్లవి గౌడ అడుగుపెడుతుందా..?

బిగ్‌బాస్ హౌస్‌లోకి పల్లవి గౌడ అడుగుపెడుతుందా..?

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో షోపై అంచనాలను పెంచగా, ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సీజన్‌లో కొత్త టాస్కులు, వినూత్న నిబంధనలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక కంటెస్టెంట్ల ఎంపికపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందూ, జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్ కుమార్, చంద్రహాస్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరి ఎంట్రీపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఇదిలా ఉండగా ప్రముఖ టెలివిజన్ నటి పల్లవి గౌడ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే షోకు మరింత ఆకర్షణ పెరిగే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.

Related Articles