భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల ఆధారంగా రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. అడవి నేపథ్యంలో తెరకెక్కించిన థ్రిల్లింగ్ విజువల్స్, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దైవిక శక్తులు, అతీత శక్తుల మధ్య జరిగే సస్పెన్స్ అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. హైఎండ్ వీఎఫ్ఎక్స్, అద్భుతమైన కెమెరా వర్క్ సినిమాకు గ్రాండియర్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘అమ్మ’ పాట భావోద్వేగంగా నిలుస్తోంది. ప్రస్తుతం ‘త్రికాల’ టైటిల్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
- May 26, 2026
0
5
Less than a minute
You can share this post!
editor

