భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా, నభా నటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించిన ‘నాగబంధం’ 3డి స్టాండీ కర్టెన్ రైజర్ ఈవెంట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రాచీన దేవాలయాలు, దైవిక శక్తులు, మిస్టికల్ ప్రపంచాలు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం విజువల్ స్పెక్టకల్‌గా రూపొందుతోంది. ఎన్ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడింది. జీ స్టూడియోస్ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకోగా, అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
- May 26, 2026
0
8
Less than a minute
You can share this post!
editor

