కోడి కోసం మొదలైన కేసు… పెద్ద మిస్టరీగా మారింది..!

కోడి కోసం మొదలైన కేసు… పెద్ద మిస్టరీగా మారింది..!

కామెడీ, మిస్టరీ అంశాల కలయికగా రూపొందిన ‘మేము కాప్’లం’ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ మహదేవపట్నం అనే ఊరిలో మొదలవుతుంది. కోడి పందేల నేపథ్యంలో జరిగే సంఘటనలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. సలార్ రాజు అనే కోడిపుంజు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఊరిలో గందరగోళం నెలకొంటుంది. ఈ కేసును ఛేదించేందుకు ఇద్దరు అమాయక పోలీసులుగా గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల రంగంలోకి దిగుతారు. సాధారణంగా ప్రారంభమైన ఈ అన్వేషణ క్రమంగా పెద్ద మిస్టరీగా మారుతుంది. విచారణలో ఎదురయ్యే వినోదభరిత పరిస్థితులు ప్రేక్షకులను నవ్విస్తాయి. అదే సమయంలో గ్రామంలోని రహస్యాలు బయటపడటం కథకు కొత్త మలుపు ఇస్తుంది. నాగబాబు కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్ మే 22 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Related Articles