వరుణ్ సందేశ్ హీరోగా ‘నా వైఫ్ మిస్సింగ్’ ప్రారంభం..!

వరుణ్ సందేశ్ హీరోగా ‘నా వైఫ్ మిస్సింగ్’ ప్రారంభం..!

వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘నా వైఫ్ మిస్సింగ్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కొమర మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఆహా సమర్పణలో శివ కంఠంనేని, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మాతలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘నయనం’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో ప్రేమ కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ప్రవీణ్, మోహిత్, సత్య శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సతీష్ కుమార్ ఎన్ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాయి బాబు తలారి ఎడిటింగ్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఉమర్జీ అనురాధ కథను అందించగా, శ్రీనివాస్ మండల స్క్రీన్‌ప్లే, ఆదిత్య భార్గవ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ‘మిస్సింగ్ వైఫ్ ఎవరు?’ అనే ఆసక్తికరమైన అంశంతో సినిమా సాగనుందని మేకర్స్ తెలిపారు.


Related Articles