భావోద్వేగాలతో నిండిన కథతో తెరకెక్కుతున్న ‘బాలన్ – ది బాయ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జితూ మాధవన్ కథ అందించగా, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేమ్ దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 19న హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. అంతకుముందు ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లోని మార్ష్ డు ఫిలింలో ఈ సినిమా స్క్రీనింగ్ జరగనుంది. మన నేటివిటీతో కూడిన భావోద్వేగ కథను యూనివర్సల్‌గా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకునేలా రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు. కేన్స్ వేదికపై ప్రదర్శనతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్స్‌లో తప్పక చూడాల్సిన సినిమాగా ‘బాలన్ – ది బాయ్’ నిలుస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.
- May 11, 2026
0
13
Less than a minute
You can share this post!
editor

