విడుదలకు ముందే రికార్డ్ – ‘పెద్ది’ 4 గంటల్లో సంచలనం..!

విడుదలకు ముందే రికార్డ్ – ‘పెద్ది’ 4 గంటల్లో సంచలనం..!

విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న ‘పెద్ది’ సినిమా మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో మరో మైలురాయిగా మారుతోంది. దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం నాలుగు గంటల్లోనే 100కె డాలర్ల మార్క్‌ను దాటి ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ట్రైలర్ కూడా రాకముందే ఈ స్థాయి రెస్పాన్స్ రావడం విశేషం. రామ్ చరణ్ రగ్గ్డ్ లుక్, రస్టిక్ బ్యాక్‌డ్రాప్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం జూన్ 3 నుంచే ప్రీమియర్ షోలతో సందడి చేయనుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్న ఈ సినిమా ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.

Related Articles