సైకాలజికల్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘రావు బహదూర్’. ఈ చిత్రాన్ని Mahesh Babu, Namrata Shirodkar సమర్పిస్తుండగా, దర్శకుడు Venkatesh Maha తెరకెక్కిస్తున్నారు. వెర్సటైల్ యాక్టర్ Satyadev Kancharana ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మిస్టరీ, ఇంటెన్స్ డ్రామా కలగలిపిన ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ‘ఓ సుందరి’ పాట ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా పోస్టర్లో సత్యదేవ్ రాయల్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో దీపా థామస్ హీరోయిన్గా నటిస్తుండగా, మరికొందరు ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తిక్ పరమార్ సినిమాటోగ్రఫీ, స్మరణ్ సాయి సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. రాయల్ విజువల్స్, సైకాలజికల్ ఎలిమెంట్స్‌తో ‘రావు బహదూర్’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది.
- May 9, 2026
0
5
Less than a minute
You can share this post!
editor

