దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన డైరెక్టర్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు భారత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు మోహన్ బాబు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు రూ.15 లక్షల ఆర్థిక విరాళాన్ని ప్రకటించారు. దాసరి నారాయణరావు తన జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించారని, సాధారణ వ్యక్తిని మోహన్ బాబుగా తీర్చిదిద్దారని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. దర్శకుడు అనే పదానికి అసలు అర్థం చెప్పిన వ్యక్తి దాసరి గారేనని అన్నారు. అలాగే దాసరి పేరు చిరస్థాయిగా నిలిచేలా తమ యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయప్రద, జయసుధ, బాల్కి, ఎస్వీ కృష్ణారెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ తదితర సినీ ప్రముఖులు పాల్గొని దాసరి సేవలను కొనియాడారు.
- May 7, 2026
0
8
Less than a minute
You can share this post!
editor

