రాజా రవీంద్ర వైలెంట్ లుక్‌లో ‘వైల్డ్’..!

రాజా రవీంద్ర వైలెంట్ లుక్‌లో ‘వైల్డ్’..!

వెర్సటైల్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో ‘వైల్డ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సాయిరాం దాసరి వయోలెంట్ సైకో థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఓవా ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై రవి పీట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మోషన్ పోస్టర్‌లో రాజా రవీంద్ర రక్తంతో తడిసిన వైలెంట్ లుక్‌లో కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. కథ, నటీనటులు మరియు టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ‘వైల్డ్’ సినిమా రాజా రవీంద్ర కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles