డ్రాగన్ కథ ఇదేనా..? వైరల్ అవుతున్న టాక్..!

డ్రాగన్ కథ ఇదేనా..? వైరల్ అవుతున్న టాక్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా కథపై వినిపిస్తున్న ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం, ఈ చిత్రం తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ పొలిటికల్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందట.

ఒక రాజకీయ నేపథ్యం ఉన్న నేర సామ్రాజ్యంలో తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే కథలో ప్రధానాంశమని టాక్. ఎన్టీఆర్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించనున్నారని సమాచారం. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ థీమ్, భారీ ఎలివేషన్లు సినిమాకు ప్రధాన హైలైట్ కానున్నాయి.

‘నాన్నకు ప్రేమతో’లో క్లాస్‌గా కనిపించిన తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ను, ఈసారి రా అండ్ రస్టిక్ స్టైల్‌లో చూపించబోతున్నారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Related Articles