కింగ్ నాగార్జున నటిస్తున్న 100వ మైల్స్టోన్ ప్రాజెక్ట్ ‘కింగ్100’ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి రా. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సినీ ప్రయాణానికి ప్రత్యేక గుర్తుగా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా, ఇప్పుడు నటి టబు ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో జాయిన్ కావడం మరింత హైప్ తీసుకొచ్చింది. ఆమె ఇప్పటికే షూటింగ్లో పాల్గొంటున్నట్టు సమాచారం. నాగార్జున-టబు జంటగా గతంలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. ‘కింగ్100’తో మరోసారి ఈ కాంబో మ్యాజిక్ రిపీట్ అవుతుందా అని సినీప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

