పాపం ప్రతాప్… థియేటర్‌లో వీర ప్రతాప్..!

పాపం ప్రతాప్… థియేటర్‌లో వీర ప్రతాప్..!

తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పాపం ప్రతాప్’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈటీవీ విన్ తీసుకొస్తున్న కంటెంట్‌పై ప్రశంసలు కురిపించారు. తిరువీర్ ఈ సినిమాలో వీర ప్రతాప్‌గా ప్రేక్షకులను అలరిస్తాడని నమ్మకం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కలయికగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు నందిని రెడ్డి, కోన వెంకట్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles