ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలిచే నటీమణుల్లో జాన్వీ కపూర్ ఒకరు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇటీవల ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ల ప్రవర్తనపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. తాము సిద్ధంగా లేని సమయంలో కూడా ఎక్కడపడితే అక్కడ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె తెలిపింది. “హాట్‌గా లేదు, అందంగా లేదు” అనే కామెంట్లు చూసినప్పుడు ఒక నటిగా బాధగా ఉంటుందని జాన్వీ చెప్పింది. జిమ్, ఎయిర్పోర్ట్, ప్రైవేట్ ఈవెంట్స్ ఎక్కడికెళ్లినా ఫోటోగ్రాఫర్లు వెంటపడుతున్నారని ఆమె వాపోయింది. అలాగే తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఒక సెన్సిటివ్ ఘటనను కూడా వెల్లడించింది. 15 ఏళ్ల వయసులోనే ఓ అశ్లీల సైట్లో తన ఫోటో కనిపించిందని చెప్పి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, ‘పెద్ది’తో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.
- April 8, 2026
0
213
Less than a minute
You can share this post!
editor

