“క్వీన్ 2తో కంగనా రీఎంట్రీ… మళ్లీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?”

“క్వీన్ 2తో కంగనా రీఎంట్రీ… మళ్లీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?”

బాలీవుడ్‌లో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కంగనా రనౌత్, ఇప్పుడు తన కెరీర్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. 2014లో విడుదలైన ‘క్వీన్’ సినిమా ఆమెకు స్టార్‌డమ్‌తో పాటు జాతీయ అవార్డ్ కూడా అందించింది. కానీ ‘మణికర్ణిక’ తర్వాత కంగనా ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ లేకపోవడంతో ఆమె సినీ ప్రయాణం కొంత మందగించింది. రాజకీయ ప్రయాణంలో బిజీగా ఉన్న కంగనా, మళ్లీ తన ఫ్యాన్ బేస్‌ను ఆకట్టుకునేందుకు ‘క్వీన్ 2’తో రాబోతుందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సీక్వెల్‌ను దర్శకుడు వికాస్ బహ్ల్ తెరకెక్కించనున్నాడు. మొదటి భాగంలో విదేశీ ప్రయాణం ఉంటే, ఈసారి ఇండియాలోని ప్రధాన నగరాలను చుట్టే జర్నీ బేస్డ్ కథగా ప్లాన్ చేస్తున్నారు. పూర్తి కొత్త కథతో తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. ‘క్వీన్ 2’తో కంగనా మళ్లీ తన పాత ఫామ్‌లోకి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles