‘అనుమాన పక్షి’ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా ‘గులాబ్ జామ్’ పాటను విడుదల చేశారు. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ పాటను రమణ గోగుల తన ప్రత్యేక శైలిలో ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ కూడా వినూత్నంగా ఉన్నాయి. ఈ పాట ఇప్పటికే మంచి స్పందన పొందుతోంది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. కథలోని కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. చిత్ర బృందం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమాపై విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
- March 28, 2026
0
108
Less than a minute
You can share this post!
editor

