ఆస్కార్ స్టేజ్‌పై వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ సంచలనం..!

ఆస్కార్ స్టేజ్‌పై వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ సంచలనం..!

ప్రపంచ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే Academy Awards వేడుకల్లో ఈసారి ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం సత్తా చాటింది. 98వ ఆస్కార్ వేడుకల్లో ఈ సినిమా మొత్తం 13 విభాగాల్లో నామినేషన్లు సాధించి ఆరు అవార్డులను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు Leonardo DiCaprio ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన అందుకుంది.
దర్శకుడు Paul Thomas Anderson తన కెరీర్‌లో తొలిసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకోవడం విశేషం. ఈ చిత్రంలో కల్నల్ స్టీవెన్ లాక్‌జా పాత్రలో నటించిన Sean Penn ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో నటుడు Kieran Culkin ఆయన తరపున అవార్డును స్వీకరించారు.
అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, కాస్టింగ్ వంటి విభాగాల్లో కూడా ఈ చిత్రం అవార్డులు గెలుచుకుని ఆస్కార్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందింది.


Related Articles