షూటింగ్ పూర్తి.. అడివి శేష్ రెడీ..?

షూటింగ్ పూర్తి.. అడివి శేష్ రెడీ..?

టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ‘డెకాయిట్‌’ (Dacoit) షూటింగ్ అధికారికంగా పూర్తయింది. వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న అడివి శేష్ ఈ సినిమాలో తొలిసారిగా మాస్, రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా మూవీ యూనిట్ సెట్స్‌లో ప్రత్యేకంగా షూట్ ర్యాప్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అడివి శేష్, సుప్రియా యార్లగడ్డ, షానియల్ డియో, అనురాగ్ కశ్యప్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సహా చిత్ర బృందం పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా ‘డెకాయిట్‌’ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Related Articles