Movie Muzz

ఆహా నుంచి మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్..?

ఆహా నుంచి మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్..?

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ **‘పోచమ్మ’**ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌కు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ను తాజాగా విడుదల చేశారు. “మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఇంటెన్స్ మ్యూజిక్ బీజీఎం ఈ వీడియోకి మరింత థ్రిల్‌ను జోడించింది. సోషల్ మీడియాలో విడుదలైన కొద్ది సేపటికే పోచమ్మ టైటిల్ గ్లింప్స్ వైరల్ అవుతోంది. ఈ సిరీస్‌లో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, డివైన్ స్టోరీలైన్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయని తెలుస్తోంది. కొంతమంది నెటిజన్స్ ఈ కథను చూసి, దీనిని వెబ్ సిరీస్ కాకుండా మూవీగా థియేటర్లలో విడుదల చేయాలని సూచిస్తున్నారు. శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై ఈ సిరీస్‌ను శ్రుతి నాయుడు నిర్మిస్తున్నారు. పోచమ్మ వెబ్ సిరీస్‌కు సంబంధించిన నటీనటులు, స్ట్రీమింగ్ డేట్ వంటి మరిన్ని వివరాలను త్వరలో ఆహా ప్రకటించనుంది.

Related Articles