ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆల్ఫా’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆలియా భట్ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఆమె ముఖంపై గాయాలు, గాట్లు కనిపించడంతో సినిమాలో తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఆలియా భట్‌తో పాటు బాలీవుడ్ అప్‌కమింగ్ స్టార్ శర్వరి కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రముఖ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాలో ఆలియా భట్, శర్వరి కలిసి బాబీ డియోల్‌ను ఎదుర్కొనే యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్‌తో ఆలియా భట్ మొదటిసారి కలిసి పనిచేస్తున్న ఈ చిత్రం ఫుల్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ‘ది రైల్వే మెన్’ సిరీస్‌కు దర్శకత్వం వహించిన శివ్ రవైల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.
- March 11, 2026
0
22
Less than a minute
You can share this post!
editor


