Movie Muzz

సుందర్ సి దర్శకత్వంలో విశాల్ మాస్ మూవీ..?

సుందర్ సి దర్శకత్వంలో విశాల్ మాస్ మూవీ..?

తమిళ స్టార్ హీరో విశాల్ మరియు దర్శకుడు సుందర్ సి కాంబినేషన్‌లో మరో మాస్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘మొగుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ‘ఆంబళ’, ‘మద గద రాజా’ సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్నారు.

డా. ఎ.సి. షణ్ముఖం ఆశీస్సులతో అవని సినిమాస్ ప్రై.లి. మరియు బెంజ్ మీడియా ప్రై.లి. బ్యానర్లపై అరుణ్ కుమార్, ఖుష్బూ సుందర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నవదీప్, సంపత్, అజయ్ ఘోష్, గరుడ రామ్, వీటీవీ గణేష్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ ప్రోమోలో విశాల్ సాధారణ మొగుడిలా ఇంట్లో పనులు చేస్తూనే, అండర్ కవర్ పోలీస్‌గా రౌడీలను ఎదుర్కొనే పాత్రలో కనిపించారు. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగా, తదుపరి షెడ్యూల్ కోల్‌కతా, గోవా, చెన్నైలో జరగనుంది.

Related Articles