Movie Muzz

అల్లు అర్జున్ తో నటించాలనుంది..?

అల్లు అర్జున్ తో నటించాలనుంది..?

బ్లాక్‌బస్టర్ మూవీ ‘మార్క్’ తో భారీ విజయాన్ని అందుకున్న హీరోయిన్ దీప్శిఖ చంద్రన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అద్భుతమైన నటన, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దీప్శిఖ, మాస్ హీరోయిన్‌గా వచ్చిన గుర్తింపును తన కెరీర్‌కు పెద్ద ప్లస్‌గా భావిస్తున్నట్లు వెల్లడించింది. స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌లో ప్రేక్షకుల అంగీకారం రావడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని తెలిపింది.

స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో కలిసి పనిచేయడం గౌరవంగా అనిపించిందని, ఆయన డిసిప్లిన్, ఫోకస్, సహనటుల పట్ల చూపే గౌరవం తనకు గొప్ప ప్రేరణగా నిలిచిందని చెప్పింది. చెన్నై బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, తమిళ్, కన్నడ, తెలుగు భాషలను నేర్చుకుంటూ విభిన్న ఇండస్ట్రీల్లో అవకాశాలు అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది.

విజయ్ ఆంటోనీతో చేసిన ‘మఝవిల్’ సినిమా అనుభవం తనకు ఎంతో నేర్పించిందని, కమర్షియల్స్ వల్ల మంచి విజిబిలిటీ వచ్చిందని తెలిపింది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘రమణి కళ్యాణం’ సినిమాలో లేయర్డ్, ఎమోషనల్ పాత్రలో కనిపించనుందని, భవిష్యత్‌లో తెలుగు సినిమాల్లో సెల్ఫ్ డబ్బింగ్ చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తోందని వెల్లడించింది.

Related Articles