క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా’ ఫెయిల్యూర్ బాయ్స్’. ఇతర కీలక పాత్రల్లో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్ పై వి ఎస్ ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించగా విజయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఫెయిల్యూర్ బాయ్స్’ 12వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. విడుదల తేదీ దగ్గరవుతున్న సమయంలో ఈ చిత్ర బృందం రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఫెయిల్యూర్ బాయ్స్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన బాబు మోహ మాట్లాడుతూ… “ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ప్రేక్షకులంతా ఇటువంటి సినిమాలను సపోర్ట్ చేసి విజయాన్ని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నారు. డైరెక్టర్ తెలుగు శ్రీను మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్ర ట్రైలర్ చూస్తుంటే సినిమాపై నాకు మరింత నమ్మకం వచ్చింది.
- December 8, 2025
0
5
Less than a minute
Tags:
You can share this post!
editor


