Movie Muzz

చిన్మయి వ్యాఖ్యలపై వివరణ కోరిన దర్శకుడు – అసలు నిజమెంటో?

చిన్మయి వ్యాఖ్యలపై వివరణ కోరిన దర్శకుడు – అసలు నిజమెంటో?

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవ‌ల ఈ సినిమా నుంచి ‘ఎం కోనె..(నెల‌రాజె..)’ అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. పాట నేప‌థ్యాన్ని గ‌మ‌నిస్తే.. కాంచీపురం సంస్థానానికి చెందిన ద్రౌపది దేవి వివాహం కడవరాయ సంస్థానం నుంచి వీరసింహ కడవరాయన్‌తో జ‌రుగుతుంది. అందులో హోయ‌సాల రాజ్యానికి చెందిన మ‌హారాజు వీర వ‌ల్లాల 3 (మూడ‌వ వీర వ‌ల్లాల‌ర్‌).. క‌డ‌వ‌రాయ‌న్‌కు ప‌ట్టాభిషేకం చేసి పెళ్లి చేస్తారు. ఈ దంప‌తులు త‌ల్లిదండ్రుల‌య్యే సంద‌ర్భంలో జ‌రిగే సీమంతం వేడుక‌లో వీర వ‌ల్లాల మ‌హారాజు క‌డ‌వ‌రాయ‌న్‌కు ఓ బ‌హుమ‌తిని ఇస్తారు. ఈ సంద‌ర్భాన్ని సినిమాలో చిత్రీక‌రించిన సంద‌ర్భంలో వ‌చ్చే పాటే ‘ఏం కోనె..’. విల‌క్ష‌ణ‌మైన సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ద్రౌప‌ది 2 నుంచి రీసెంట్‌గా విడుద‌లైన ‘ఎం కోనె..’ (నెలరాజె..) సాంగ్ ట్రాక్‌కు సంబంధించిన పాట పాడిన సింగ‌ర్‌ చిన్మ‌యి శ్రీపాద చేసిన వ్యాఖ్య‌ల‌కు నెటిజ‌న్స్ నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్‌.జి స్పందించారు.

editor

Related Articles