యంగ్ హీరో తిరువీర్ మరియు ప్రతిభావంతురాలు ఐశ్వర్య రాజేష్ తమ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో విజయాలను అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం జట్టుకట్టారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో, గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్లో రూపొందుతున్న చిత్రం ఇదే. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు ‘ఓ..! సుకుమారి’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఆకట్టుకునే పోస్టర్‌ను విడుదల చేస్తూ కథలోని ఎమోషన్స్‌ను సూచించేలా డిజైన్ చేశారు. నీలిరంగు హృదయ చిహ్నాన్ని నారింజ రంగు మెరుపుతో విభజించడం, గ్రామ ప్రజలు పరిగెడుతున్న విజువల్స్ కథలోని ట్విస్ట్స్కు సంకేతాలుగా కనిపించాయి. ఈ చిత్రానికి బలమైన టెక్నికల్ టీం పని చేస్తోంది. ‘రజాకార్, పోలిమేర’ సినిమాలకు కెమెరా అందించిన సి.హెచ్. కుషేందర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు. ‘బలగం’ ఫేం తిరుమల ఎం కూడా ఈ చిత్రంలో కీలకంగా పనిచేస్తున్నారు.
- December 4, 2025
0
3
Less than a minute
You can share this post!
editor


