Movie Muzz

నందమూరి వారసుడుమోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పడు?

నందమూరి వారసుడుమోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పడు?

నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రశ్నకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడన్నది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇంతకుముందు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయమయ్యే సినిమా ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్‌ ముందుకు సాగలేదు. అయితే తాజాగా గోవాలో జరిగిన ‘ఇఫీ’ వేడుకల్లో బాలకృష్ణ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్లాసిక్‌ చిత్రం ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా రానున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’‌లోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నట్లు ఆయన ధృవీకరించారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు క్రిష్‌ రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కథా పనుల్లోనే ఆయన బిజీగా ఉన్నారని సమాచారం. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో జోష్‌ పెరిగింది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం టాలీవుడ్‌ కూడా ఎదురు చూస్తున్న వేళ, ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ ఎప్పుడు సెట్స్‌ పైకి వెళ్తుందో చూడాల్సి ఉంది.

editor

Related Articles