Movie Muzz

‘సైక్ సిద్ధార్థ’ ట్రైలర్ — లోపలున్న రహస్యం ఏమిటి?

‘సైక్ సిద్ధార్థ’ ట్రైలర్ — లోపలున్న రహస్యం ఏమిటి?

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు,  శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన  సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ నందు మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ గా ఉంది. ఇదంతా ఒక టీం జర్నీ. డైరెక్టర్ వరుణ్ ఆర్కిటెక్చర్  ఆ ఫీల్డ్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. తనకి ఫిలిం మేకింగ్ అంటే ప్యాషన్. అన్నపూర్ణ స్టూడెంట్.  రామనాయుడులో డెబ్యు చేస్తున్నాడు. నాకు రైటింగ్, డైరెక్షన్ మీద మొదటి నుంచే ఆసక్తి ఉంది.  కొన్ని మ్యూజిక్ వీడియోస్ కి డైరెక్షన్ చేశా. బ్రోచేవారు బ్యానర్లో నాకు డైరెక్టర్ గా ఒక సినిమా ఓకే అయింది. అప్పుడే ఒక రైటర్ కావాలంటే వరుణ్ పరిచయమయ్యాడు.

editor

Related Articles