ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ… అందరికీ హాయ్. రివ్యూవర్స్ కి థాంక్స్ చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సినిమా మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ సినిమా. ఎక్కువ మంది జనాలు చూడాలనే మైండ్ సెట్ తోనే తీసాం. కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ ఎండ్ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే మాకు ఆడియన్స్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎప్పుడు చేయనంతగా సినిమాని ప్రమోట్ చేశాం. ఎందుకంటే నాకు అంత పర్సనల్ కలెక్షన్ ఉంది, ఇప్పటివరకు చాలా ఎమోషన్స్ చూసాం. కానీ స్టార్ అండ్ ఫ్యాన్ కు మధ్య ఉన్న ఎమోషన్ చెబుతూ, హ్యూమన్ ఎమోషన్ కూడా టచ్ చేసిన సినిమా ఇది.
- December 3, 2025
0
87
Less than a minute
You can share this post!
editor


