స్టార్ హీరో ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్ట్ సెటప్?

స్టార్ హీరో ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్ట్ సెటప్?

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ రెండు భాగాలు జాతీయస్థాయిలో సంచలనం సృష్టించి దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత ‘సలార్’తో మరోసారి హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ పై దృష్టి సారించారు. మైత్రీ మూవీ మేకర్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట ‘డ్రాగన్’గా పిలిచినప్పటికీ, అధికారికంగా ఎలాంటి టైటిల్ ప్రకటించకపోవడంతో ‘యన్టీఆర్–నీల్ మూవీ’గానే పిలుచుకుంటున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటించనున్నారన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దాదాపు 45 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న‌ట్టు వార్త‌లు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు అనిల్ కపూర్ కొత్త కాదు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశవృక్షం’ చిత్రంలో ఆయన తొలిసారి నటించారు. తర్వాత బాపు రూపొందించిన హిందీ చిత్రాలు ‘హమ్ పాంచ్’, ‘వో సాత్ దిన్’ వంటి సినిమాలతో చక్కటి గుర్తింపును తెచ్చుకున్నారు.

editor

Related Articles