సైన్స్ ఫిక్షన్ థ్రిల్‌తో ‘కిల్లర్’ పెద్ద షాక్ ఇవ్వబోతోందట!

సైన్స్ ఫిక్షన్ థ్రిల్‌తో ‘కిల్లర్’ పెద్ద షాక్ ఇవ్వబోతోందట!

జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ ను తాజాగా లాంఛ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో..
యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ – జ్యోతి గారు తనకు యాక్షన్ తెలియదు అనేవారు. కానీ మేము 15 మందితో అటాక్ చేసే ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాం. ఆ సీక్వెన్స్ రెడీ చేయడానికి మాకు 3 గంటలు టైమ్ పట్టింది. కానీ జ్యోతి గారు వచ్చి అరగంటలో మొత్తం యాక్షన్ పార్ట్ చేశారు. మేము షాక్ అయ్యాం. ఈ సినిమాలో జ్యోతి గారు చేసిన యాక్షన్ సీక్వెన్సులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నారు.

editor

Related Articles