లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసిన వీడియో సాంగ్.?

లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసిన వీడియో సాంగ్.?

ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం శ్రీలేఖ స్వరపర్చి పాడిన ‘మా చిన్ని శివ’ డివోషనల్ వీడియో సాంగ్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను జి. మణి లక్ష్మణరావు ప్రొడ్యూస్ చేశారు. భారతి బాబు లిరిక్స్ అందించగా శ్రీరామ్ కంగటాల డీవోపీ, ఎడిటింగ్‌తో పాటు దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ జి. మణి లక్ష్మణరావు మాట్లాడుతూ – ఈ రోజు మా చిన్ని శివ డివోషనల్ సాంగ్ లాంఛ్ చేసేందుకు అతిథిగా వచ్చిన విజయేంద్రప్రసాద్‌కి థ్యాంక్స్. అద్భుతమైన ట్యూన్ మ్యూజిక్ కంపోజ్ చేసి ఎంఎం శ్రీలేఖ ఈ పాటను పాడారు. ఈ పాటను గ్రాండ్‌గా మన ముందుకు తీసుకొచ్చిన నిర్మాత జి.మణి లక్ష్మణరావుకి కృతజ్ఞతలు చెబుతున్నా. మా చిన్ని శివ పాటను మీరంతా విని భక్తితో పరవశిస్తారని ఆశిస్తున్నా అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ – నేను గతంలో శివుడి డివోషనల్ సాంగ్స్ చేశాను.

editor

Related Articles