గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా అఖండ 2: తాండవం భారీ హైప్‌ను సృష్టిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్.థమన్ అందించిన సంగీతం ఇప్పటికే సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ది తాండవం’ పూర్తి పాటను ముంబై జూహూ పీవీఆర్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. థమన్ ఇచ్చిన డివైన్-హై వోల్టేజ్ సౌండ్‌ట్రాక్ బాలయ్య అఘోర అవతారానికి కొత్త స్థాయిలోElevation అందించింది. అఘోర మంత్రాలు, భారీ ఆలయ వాతావరణం, శివతాండవం చేసే బాలకృష్ణ లుక్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ రేపుతోంది. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే డివైన్ ఇంటెన్సిటీ, థమన్ ట్రేడ్‌మార్క్ పెర్కషన్ స్కోర్‌తో కలిసిపోయి అఖండ 2 పై భారీ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రం 2025లో భారీ స్థాయిలో విడుదలై మళ్ళీ బాలయ్య—బోయపాటి కాంబినేషన్ పవర్‌ను నిరూపించనున్నదని అభిమానులు నమ్ముతున్నారు.
- November 15, 2025
0
60
Less than a minute
You can share this post!
editor

